నాని కొత్త సినిమాకు ఆసక్తికర టైటిల్

  • IndiaGlitz, [Saturday,November 21 2020]

'ఇది వరకు నా చిత్రాల్లో చూడని ప్రేమ, నవ్వులను నా 28వ చిత్రంలో చూస్తారు' అని అంటున్నారు నేచురల్‌స్టార్‌ నాని. ఆయన హీరోగా నటిస్తోన్న 28వ సినిమా టైటిల్‌ను ఆసక్తికరంగా అనౌన్స్‌ చేశాడు. తన 28వ సినిమాకు సంబంధించిన కర్టెన్‌ రైజర్‌ను శనివారం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. నటుడు హర్షవర్ధన్‌, కమెడియన్‌ సుహాస్‌ సహా మరికొంత మంది జరిగిన డిస్కషన్‌గా చూపిస్తూ నాని 28వ సినిమాకు 'అంటే సుందరానికీ' టైటిల్‌ను ఖరారు చేశారు. కర్టెన్‌ రైజర్‌లో నాని డిఫరెంట్‌ గెటప్‌లో కనిపిస్తున్నారు. లగేజ్‌ బ్యాగ్‌ పట్టుకుని అటు తిరిగి నిలుచుని ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూస్తున్నారు నాని. అంటే సినిమా విదేశాల్లో జరిగే లవ్‌ ఎంటర్‌టైనర్‌ అని అర్థమవుతుంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేసి, 2021లో సినిమాను విడుదల చేయబోతున్నట్లు యూనిట్‌ తెలియజేసింది. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నికేత్‌ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఈ ఏడాది వి అనే యాక్షన్‌ థ్రిల్లర్‌తో మెప్పించిన నాని, ఇప్పుడు టక్‌ జగదీశ్‌ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. దీని తర్వాత 27వ చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే 'అంటే సుందరానికీ' సినిమా షూటింగ్‌ ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి.