నాని న్యూమూవీ డీటైల్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నేను లోకల్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఆ మూవీ తర్వాత నాని నూతన దర్శకుడు శివ శంకర్ లాలమ్ తో ఓ మూవీ చేయనున్నారు. దర్శకులు రామ్ గోపాల్ వర్మ, పరుశురామ్, వి.ఎన్.ఆదిత్యల దగ్గర శివ శంకర్ లాలమ్ వర్క్ చేసారు.
ఈ చిత్రంలో నాని సరసన నివేథా థామస్ నటిస్తుంది. ఆది పినిశెట్టి, మురళీశర్మ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేషన్ మరియు డి.వి.వి ఎంటర్ టైన్మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 70% యు.ఎస్ లో 30% ఇండియాలో షూటింగ్ చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ను డిసెంబర్ లో ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments