నాని నేను లోక‌ల్ సింగిల్ షాట్ టీజ‌ర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Friday,November 11 2016]

నేచుర‌ల్ స్టార్ నాని - నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని ప‌క్కా మాస్ గెట‌ప్ లో క‌నిపిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ మూవీ 28 సెక‌న్ల సింగిల్ షాట్ టీజ‌ర్ ను రిలీజ్ చేసారు. ప్రేమికులకు మాట‌లు అవ‌స‌రం లేదు. మాట‌లు లేక‌పోయినా మ‌న‌సులో మాట‌లు అర్ధం చేసుకోగ‌ల‌రు. అందుక‌నే అన‌కుంట‌...ఈ టీజ‌ర్ లో నాని...త‌న ప్రియురాలు (కీర్తి సురేష్)ను ముద్దుకోసం ప‌క్క‌కు ర‌మ్మ‌న‌డం...త‌ను రాను అంటూ చెంప పై ఒకటి ఇవ్వ‌డం...ఇక లాభం లేద‌నుకుని నాని లాక్కుని తీసుకెళ్ల‌డం...ఇదంతా సింగిల్ షాట్ లో ఎలాంటి మాట‌లు లేకుండా చిత్రీక‌రించ‌డం విశేషం. ఈ రొమాంటిక్ సీన్ కి దేవిశ్రీ మ్యూజిక్ యాడ్ అవ్వ‌డంతో టీజ‌ర్ అదిరింది. యూత్ కి చూసిన వెంట‌నే క‌నెక్ట్ అవుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. నాని ని స‌రికొత్త‌గా చూపిస్తున్న నేను లోక‌ల్ చిత్రాన్ని క్రిస్మస్ కానుక‌గా డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. టీజ‌రే చూసిన వెంట‌నే క‌నెక్ట్ అయి మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంటే.... ఇక మూవీ ఏరేంజ్ లో క‌నెక్ట్ అవుతుందో చూడాలి..!

More News

బాహుబ‌లి నిర్మాతల‌ ఇళ్లు, ఆఫీస్ ల‌ పై ఐటి దాడులు..!

500, 1000 నోట్ల ర‌ద్దుతో టాలీవుడ్ కి ఓ షాక్ త‌గిలితే...ఇప్పుడు బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్స్ పై ఐటి దాడుల‌తో మ‌రో షాక్ త‌గిలింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం బాహుబ‌లి.

చందు మొండేటి నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

కార్తికేయ‌, ప్రేమ‌మ్ చిత్రాల‌తో వ‌రుస‌గా విజ‌యాలు అందుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి. త‌దుప‌రి చిత్రాన్ని చందు ఏ హీరోతో చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే...చందు నెక్ట్స్ మూవీ హీరో అంటూ వ‌రుణ్ తేజ్, ర‌వితేజ‌, ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి.

గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ & ఆడియో రిలీజ్ డీటైల్స్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.ఈ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తున్నారు.

500, 1000 నోట్ల రద్దు పై స్పందించిన మహేష్..!

భారత ప్రధాని నరేంద్రమోడీ 500,1000నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

నవంబర్ 11న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఆడియో విడుదల

వైవిధ్యమైన కథాంశాలతో ఢిఫరెంట్ స్క్నీన్ ప్లేతో సూపర్హిట్ చిత్రాలు అందించిన యంగ్ఎనర్జిటిక్ స్టార్ నిఖిల్ మరో వినూత్నమైన కథాంశంతో వస్తున్న చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'.