నాని నేను లోకల్ రిలీజ్ డేట్స్..!
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని - నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం నేను లోకల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ ఫేమ్ నక్కిన త్రినాధరావు తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న నేను లోకల్ చిత్రాన్ని దిల్ రాజు క్రిస్మస్ కానుకగా ఈనెల 23న రిలీజ్ చేయాలి అనుకున్నారు.
ఈ సినిమా ప్రారంభోత్సవం రోజునే క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఆర్టిస్టుల డేట్స్ ప్రాబ్లమ్ వలన షూటింగ్ అనుకున్న టైమ్ కి పూర్తి కాలేదు. అందుచేత ఈ చిత్రాన్ని జనవరి 26న కుదరకపోతే ఫిబ్రవరి 3న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments