నాని నేను లోకల్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
Friday, October 28, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం నేను లోకల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ ఫేమ్ నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లోకల్ లో ఉండే అబ్బాయి నాన్ లోకల్ అమ్మాయిని ఎంతలా ప్రేమిస్తాడో తెలియచెప్పేలా నేను లోకల్ చిత్రం రూపొందుతుంది.
ఈ చిత్రంలో హీరో నవీన్ చంద్ర ముఖ్యపాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఈరోజు 2 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, జెంటిల్ మన్, మజ్ను చిత్రాలతో వరుసగా విజయాలు సాధించిన నాని నేను లోకల్ తో కూడా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments