నాని 'నేను లోకల్' ఆడియో తేదీ

  • IndiaGlitz, [Friday,January 13 2017]

'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం', 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌', 'కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌', 'జెంటిల్ మ‌న్‌', మ‌జ్ను'.. వ‌రుస ఐదు చిత్రాల స‌క్సెస్‌తో ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో "సినిమా చూపిస్తా మామా" చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'నేను లోక‌ల్‌'."ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్‌...క్యాప్ష‌న్‌. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల గురించి ....

చిత్ర స‌మ‌ర్ప‌కుడు దిల్ రాజు మాట్లాడుతూ - ''నేను లోక‌ల్ చిత్రంలో సరికొత్త నానిని చూస్తారు. డైరెక్ట‌ర్ త్రినాథ్ త‌న‌దైన స్టైల్ల్లో, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, మంచి ఎన‌ర్జీ ఉన్న క్యారెక్ట‌ర్‌తో రూపొందిస్తున్న ల‌వ్ స్టోరి ఇది. మా బ్యాన‌ర్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన దేవిశ్రీ అందించిన పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం కాకినాడ‌లో జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది. ఈ కార్య‌క్ర‌మానికి సినీ రంగానికి చెందిన ప‌లువ‌రు ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. నాని కెరీర్‌లో ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది'' అన్నారు.

నాని, కీర్తిసురేష్ హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ : దిల్ రాజు, సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రినాథ రావు నక్కిన, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్.

More News

అమెరికాలో శాతకర్ణి కలెక్షన్స్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. జాగర్లమూడి క్రిష్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది.

చరణ్ మూవీలో చైతు హీరోయిన్..!

ధృవ చిత్రంతో సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్ట్స్ మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందే భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

సంక్రాంతికి బేవర్స్ ఫస్ట్ లుక్

ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు సాంగ్స్ తో పాటు డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

నాగ్ మరోసారి బెంచ్ మార్క్ సెట్ చేసారంటున్న నాని..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి బెంచ్ మార్క్ సెట్ చేసారని నాని అంటున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే... అందరూ బాగుండాలి..! అందరి సినిమాలు విజయం సాధించాలి అని కోరుకునే మంచి మనిషి కింగ్ నాగార్జున.

సాయిధరమ్ తేజ్ విన్నర్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్..!

సాయిధరమ్తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం విన్నర్. ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.