Ante Sundaraniki Trailer : నవ్వుల విందు భోజనమే.. 'అంటే సుందరానికి' ట్రైలర్ అదుర్స్

  • IndiaGlitz, [Friday,June 03 2022]

శ్యామ్ సింగరాయ్‌తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కిన నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికి’’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నాని సరసన రాజా రాణి ఫేమ్ నజ్రీయా నజ్రిమ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాని బ్ర‌హ్మ‌ణుడి పాత్ర‌లో న‌టించ‌గా, న‌జ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌టించింది. నరేశ్, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 10న తెలుగుతో పాటు త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల కానుంది.

దీంతో ‘‘ అంటే సుందరానికి’’ ప్రమోషనల్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్ . అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ డేట్‌ను మేక‌ర్స్ ఇటీవల ప్ర‌క‌టించారు. జూన్ 2న ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్రబృందం ఓ గ్లింప్స్ రిలీజ్ చేసింది. అన్నట్లుగానే ఈరోజు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సప్త సముద్రాలను దాటి అమెరికాలో అడుగుపెట్టిన సుందర్ అక్కడ ఎలా హీరోయిన్‌ను కలిశాడు. ఆ తర్వాత ఏం జరిగింది. ఈ ఇద్దరి వల్ల రెండు ఫ్యామిలీల్లో ఎలాంటీ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేది కథగా తెలుస్తోంది.

2 నిమిషాల 50 సెకండ్ల నిడివిగల ఈ ట్రైలర్.. 'ఎవరా అమ్మాయి.. హిందుస్ హా, చెప్పిచావరా?' అనే నరేశ్ డైలాగుతో ఆరంభం అవుతుంది. 'నాకు పెద్ద కోరికలు ఏమీ లేవండి, నేను కూడా అమెరికా వెళ్లి.. అక్కడి నుంచి మా స్నేహితులకు ఫోన్ చేసి నేను కాలిఫోర్నియాలో ఉన్నాను, ఇక్కడ ఈ వర్షాలు ఏంట్రా బాబు అని ఒకసారి మాట్లాడితే చాలండి'అనే నాని వాయిస్ ఓవర్ బాగుంది. మొత్తం మీద ట్రైలర్‌లో చూపించిన ప్రతి క్యారెక్టర్‌ నవ్వులు పూయించింది. ముఖ్యంగా హీరో నాని హావభావాలు యూత్, ఫ్యామిలీని కట్టిపడేస్తాయి. నాని కామెడీ, నజ్రియా నజిమ్ అందం సినిమాకు ప్లస్ కానున్నాయి. మరి అసలు కథేంటో తెలియాలంటే జూన్ 10 వరకు వెయిట్ చేయాల్సిందే.