నాగ్, నాని మూవీ సెకండ్ షెడ్యూల్ అప్‌డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్.. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇద్దరు కథానాయికలకు అవకాశమున్న ఈ సినిమాలో ఒక నాయికగా 'ఛలో' ఫేమ్ రష్మిక మందన్నను ఎంపిక చేసింది చిత్ర బృందం. మరో హీరోయిన్ పేరును కూడా త్వరలోనే ప్రకటించనుంది. ఈ సినిమా సంగీత విభాగానికి వస్తే.. అశ్వినీదత్ ఆస్థాన సంగీత దర్శకుడు "మెలోడీ బ్రహ్మ" మణిశర్మ సంగీత సారథ్య బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందీ చిత్రం. ఈ షెడ్యూల్‌లో నాని, రష్మిక పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. రెండో షెడ్యూల్‌ను ఏప్రిల్ 3 నుంచి ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్‌లో నాగార్జున కూడా పాల్గొననున్నారని సమాచారం. నాలుగు నెలల్లో అంటే ఆగష్టు కల్లా చిత్రీకరణని పూర్తి చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments