ఫ్యానీ రేటు నాని సినిమా థియేట్రికల్ రైట్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస సక్సెస్‌లను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు డివివి దానయ్య నిర్మాత శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న `నిన్ను కోరి` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నివేదాథామస్ హీరోయిన్‌గా నటిస్తుంది. జెంటిల్ మన్ సినిమా తర్వాత నాని, నివేదా థామస్ కలిసి నటిస్తున్న చిత్రమిది. హీరో ఆది పినిశెట్టి కీలకపాత్రలో కనిపిస్తున్నాడు.
నాని రీసెంట్ సినిమా `నేను లోకల్` బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని నమోదు చేసుకోవడంతో `నిన్ను కోరి` సినిమా బిజినెస్ విషయంలో నిర్మాతలు బాగానే లాభపడ్డారట. ఆంధ్ర, తెలంగాణలో థియేట్రికల్ రైట్స్‌ను 14 కోట్లకు అమ్మేశారని సమాచారం. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఈ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అలాగే యు.ఎస్ ఓవర్‌సీస్ హక్కులను రెడ్ హార్ట్స్ సంస్థ నాలుగు కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. సినిమా ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్స్‌ను సాధిస్తుందనడంలో సందేహం లేదు. మొత్తం మీద `నిన్ను కోరి` నిర్మాతలు విడుదలకు ముందే లాభాల బాట పట్టారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments