నాని.. 'సభకు నమస్కారం'
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి ‘ఎం.సి.ఎ’ వరకు వరుసగా ఎనిమిది విజయవంతమైన సినిమాల్లో నటించారు నేచురల్ స్టార్ నాని. అయితే.. ‘కృష్ణార్జున యుద్ధం’ ఈ విజయపరంపరకు అడ్డుకట్ట వేసింది. దీంతో తదుపరి చిత్రాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు నాని. ఈ నేపథ్యంలోనే కింగ్ నాగార్జునతో కలిసి ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. అలాగే.. ‘మళ్ళీ రావా’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ‘జెర్సీ’ సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపారు.
ఇదిలా ఉంటే.. నాని మరో కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. గతంలో నానితో కలిసి ‘నేను లోకల్’, ‘ఎం.సి.ఎ’ లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన ‘దిల్’ రాజు ఈ కొత్త సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ సినిమాతో ఈ ద్వయం హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి. అలాగే ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ నిర్మాత.. ఈ సినిమాతో కూడా మరో కొత్త దర్శకుణ్ణి పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా ఈ మూవీకి ‘సభకు నమస్కారం’ అనే టైటిల్‌ను నిశ్చయించినట్టుగా కూడా సమాచారం. కాగా.. ప్రస్తుతం నాగార్జునతో చేస్తున్న మల్టీస్టారర్ మూవీ పూర్తయ్యాకే నాని ‘జెర్సీ’.. మూవీతో పాటు ‘సభకు నమస్కారం’ కూడా ప్రారంభించనున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com