నాని.. 'స‌భ‌కు న‌మ‌స్కారం'

  • IndiaGlitz, [Thursday,June 21 2018]

‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి ‘ఎం.సి.ఎ’ వరకు వరుసగా ఎనిమిది విజయవంతమైన సినిమాల్లో నటించారు నేచురల్ స్టార్ నాని. అయితే.. ‘కృష్ణార్జున యుద్ధం’ ఈ విజయపరంపరకు అడ్డుకట్ట వేసింది. దీంతో త‌దుప‌రి చిత్రాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు నాని. ఈ నేపథ్యంలోనే కింగ్ నాగార్జునతో కలిసి ఓ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో నటిస్తున్నారు. అలాగే.. ‘మళ్ళీ రావా’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ‘జెర్సీ’ సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపారు.

ఇదిలా ఉంటే.. నాని మరో కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. గతంలో నానితో కలిసి ‘నేను లోకల్’, ‘ఎం.సి.ఎ’ లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన ‘దిల్’ రాజు ఈ కొత్త సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ సినిమాతో ఈ ద్వయం హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తుందేమో చూడాలి. అలాగే ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ నిర్మాత.. ఈ సినిమాతో కూడా మరో కొత్త దర్శకుణ్ణి పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా ఈ మూవీకి ‘సభకు నమస్కారం’ అనే టైటిల్‌ను నిశ్చయించినట్టుగా కూడా సమాచారం. కాగా.. ప్రస్తుతం నాగార్జునతో చేస్తున్న మల్టీస్టారర్ మూవీ పూర్తయ్యాకే నాని ‘జెర్సీ’.. మూవీతో పాటు ‘సభకు నమస్కారం’ కూడా ప్రారంభించనున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

More News

మ‌హేష్‌కు తండ్రిగా మ‌రోసారి..

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ 25వ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తోడ‌ల్లుళ్ళు పాత్ర‌ల్లో వెంకీ, వ‌రుణ్‌?

'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.

జూన్‌ 21న 'తేజ్‌ ఐ లవ్‌ యు' సాంగ్‌ ప్రోమో విడుదల

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వం

ఈ నెల 29న 'నా లవ్ స్టోరి'

అశ్వని క్రియేషన్స్ బ్యానర్ పై జి. లక్ష్మి నిర్మాతగా, శివగంగాధర్ దర్శకత్వంలో మహిధర్ , సోనాక్షి సింగ్ రావత్ లను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం 'నా లవ్ స్టోరీ'.

'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' అన్ని సెక్షన్స్ ఆడియన్స్ కీ నచ్చుతుంది - ఆలూరి సాంబశివరావు

ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు  కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి, తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి