నాని మూవీ రిలీజ్ డేట్‌

  • IndiaGlitz, [Monday,July 25 2016]

'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌', ఇప్పుడు 'జెంటిల్‌మ‌న్' ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న హీరో నాని ఇప్పుడు విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జెమిని కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ చిత్రాన్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని నిర్మాత కిర‌ణ్ యోచిస్తున్నాడ‌ట‌. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి 'మ‌జ్ను' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ చిత్రంలో రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడు.