నాని..ముందే వస్తున్నాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. భలే భలే మగాడివోయ్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన నాని.. వరుసగా ఆరు హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం నాని రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి ఎం.సి.ఎ కాగా, మరొకటి కృష్ణార్జున యుద్ధం.
దిల్ రాజు నిర్మిస్తున్న ఎం.సి.ఎ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే డిసెంబర్ 22న అఖిల్ రీ లాంచ్ మూవీ హలో ఉండడంతో.. ఈ సినిమా ముందుకో, వెనక్కో వెళ్లే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక లేటెస్ట్ ఇన్‌ఫర్‌మేషన్ ప్రకారం.. ఈ సినిమాని డిసెంబర్ 15న రిలీజ్ చేసే చాన్స్ ఉందని తెలిసింది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అవార్డ్ విన్నింగ్ సీనియర్ హీరోయిన్స్ భూమిక, ఆమని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com