నాని సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ ఇదేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించిన కథ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే.. ప్రేమించడానికి అమ్మాయి దొరికితే చాలనుకునే పాత్ర కృష్ణది అయితే.. విదేశాల్లో ఉండే రాక్ స్టార్ అర్జున్.. ఒకే అమ్మాయిని ఎక్కువ రోజులు ఎలా ప్రేమిస్తారు? మనవల్ల కాదు అనుకునే పాత్ర.
ఇలా భిన్నమైన భావాలున్న ఈ రెండు పాత్రలు ప్రేమలో పడతాయి. అయితే ప్రేమించిన అమ్మాయి కోసం ఇండియాకి వస్తాడు అర్జున్. తను ప్రేమించిన అమ్మాయి ఆపదలో ఉందని.. వచ్చాక తెలుస్తుంది. సరిగ్గా అటువంటి ఆపదలోనే కృష్ణ ప్రేమించిన అమ్మాయి కూడా ఉంటుంది.ఇదే ఇంటర్వెల్ ట్విస్ట్ అని సమాచారం. ప్రేమించిన అమ్మాయిల్ని రక్షించుకునే నేపథ్యంలో కృష్ణ, అర్జున్ ఒకరికి ఒకరు ఎదురుపడతారు. వీరు ప్రేమించిన అమ్మాయిలను కిడ్నాప్ చేసింది.. అమ్మాయిలను అమ్మేసే బ్రోతల్ ముఠా అని తెలుసుకుంటారు. ఆ ముఠాతో సాగించే యుద్ధమే ఈ చిత్రకథ. ఈ కథలో వీరిద్దరూ ప్రేమించిన అమ్మాయిల్ని ఏ విధంగా రక్షించుకోగలిగారు? ఏ విధంగా కలుసుకోగలిగారు? అన్నది తెరపైనే చూడాలి. ఈ కథకు దర్శకుడు తనశైలి కామెడీని జోడించి థ్రిల్లర్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మలిచారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది ఈ చిత్రం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments