తేజు చేతికి నాని చిత్రం...?
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు వరుస సినిమాలను నిర్మిస్తుంది. అందులో భాగంగా నేచురల్ స్టార్ నాని, కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో ఓ సినిమా నిర్మించడానికి సిద్ధమైంది. అయితే నాని వరుస సినిమాలతో బిజీగా ఉండటం ఇత్యాది కారణాల వల్ల సినిమా మెటిరియలైజ్ కాలేకపోయింది.
దీంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాను తేజు హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో చేయాలని యోచిస్తున్నారట. అయితే తేజు ఇప్పుడు కరుణాకరణ్‌తో సినిమా చేస్తున్నాడు.
దీంతో పాటు గోపీచంద్ మలినేని సినిమా చేయాల్సి ఉంది. చంద్రశేఖర్ యెలేటి దర్శకత్వంలో తేజు సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి కిశోర్ తిరుమల తేజు డేట్స్ అడ్జస్ట్ చేసి సినిమా చేస్తాడంటారా? చూడాలి మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com