నాని న్యూమూవీ టైటిల్..

  • IndiaGlitz, [Monday,February 29 2016]
నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఇటీవ‌ల రిలీజై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ప్ర‌స్తుతం నాని ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. అష్టాచ‌మ్మా త‌ర్వాత నాని - ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ క‌ల‌సి ఈ సినిమా చేస్తుండ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ఏర్ప‌డింది.
ఈ మూవీలో నాని స‌ర‌స‌న సుర‌భి, నివేద థామ‌స్ న‌టిస్తున్నారు. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు పూర్తి భిన్నంగా కొత్త జోన‌ర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి థ‌మ‌కా అనే టైటిల్ ఖ‌రారు చేసారు. ప్ర‌స్తుతం కొడైకెనాల్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. దాదాపు 40% షూటింగ్ పూర్త‌య్యింది. ఏప్రిల్ నెలాఖ‌రుకి షూటింగ్ పూర్తి చేయ‌నున్నారు. మే నెలాఖ‌రున ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.