చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నాని-మోహనకృష్ణ ఇంద్రగంటి చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ - ''ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్ కు గురి చేసే ఎలిమెంట్స్, మంచి రొమాన్స్, సెంటిమెంట్, వినోదం.. ఇలా అన్ని అంశాలు కుదిరిన కథ. అతి త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. డిసెంబర్ 2న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించాం. హైదరాబాద్, కొడైకెనాల్ లో షెడ్యూల్స్ జరిపాం. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 6 వరకూ కొడైకెనాల్ లో జరిపిన షెడ్యూల్ లో ఒక పాట, కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. మార్చి 14న హైదరాబాద్ లో షెడ్యూల్ మొదలుపెట్టాం. ఏప్రిల్ 6 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్లో ఇంపార్టెంట్ టాకీ, ఒక పాట చిత్రీకరిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రిల్ రెండో వారంలో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడతాం. మే నెలాఖరున లేక జూన్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com