ఎం.సి.ఎ ఫస్ట్‌లుక్ ఎప్పుడంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని, ఫిదా స్టార్ సాయిపల్లవి జంటగా ఎం.సి.ఎ పేరుతో ఓ సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓ మై ఫ్రెండ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని దీపావళి కానుకగా రేపు (బుధవారం) విడుదల చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
నేను లోకల్ తరువాత నాని, దిల్ రాజు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం నాని ఎం.సి.ఎతో పాటు కృష్ణార్జున యుద్ధం కూడా చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com