'ఎం.సి.ఎ' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
డబుల్ హ్యాట్రిక్ హీరో.. నేచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్లో రూపొందిన సినిమా 'ఎం.సి.ఎ'. సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ఫై దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. డిసెంబర్ 21న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా...
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - "మా బ్యానర్లో ఈ ఏడాది 'శతమానంభవతి', 'నేను లోకల్', 'దువ్వాడ జగన్నాథమ్', 'ఫిదా', 'రాజా ది గ్రేట్' చిత్రాలతో వరుసగా ఐదు సూపర్‌హిట్ చిత్రాలను చేశాం. ఇప్పుడు 'ఎం.సి.ఎ'తో డబుల్ హ్యాట్రిక్‌కు రెడీ అయ్యాం. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధిస్తామనే కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. డైరెక్టర్ వేణు శ్రీరాం డైరెక్షన్లో సినిమా చాలా సూపర్బ్‌గా వచ్చింది. యూనిట్ అంతా హ్యాపీగా ఉన్నాం.
ముఖ్యంగా నాని, సాయిపల్లవిలకు ఈ సినిమాతో మా బ్యానర్లో మరో హిట్ రావడం గ్యారంటీ. అలాగే భూమిక ఇందులో వదిన పాత్రలో నటించారు. చాలా గ్యాప్ తర్వాత భూమిక తెలుగులో చేస్తున్న సినిమా ఇది. వదిన, మరిది మధ్య అనుబంధంపై సినిమా ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని, నేపథ్య సంగీతాన్ని అందించారు. అల్రెడి విడుదలైన పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి అంచనాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్గా విడులైన ట్రైలర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ష్యూర్ హిట్ అవుతుందని అందరూ అంటున్నారు. ఈ అంచనాలకు రీచ్ అయ్యేలా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సినిమా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సమీర్‌రెడ్డి విజువల్స్ సినిమాకు మరో ప్లస్ పాయింట్ అవుతుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎటువంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న గ్రాండ్ విడుదల చేస్తున్నాం" అన్నారు.
నాని, సాయిపల్లవి, భూమిక, విజయ్, సీనియర్ నరేష్, ఆమని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ః మామిడాల తిరుపతి, శ్రీకాంత్ విస్సా, ఆర్ట్ డైరెక్టర్ః రామాంజనేయులు, మ్యూజిక్ః దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీః సమీర్‌రెడ్డి, నిర్మాణంః శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నిర్మాతలుః దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః శ్రీరామ్ వేణు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments