నాని' మజ్ను' చిత్రం రెండవ పాట విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరోగా,ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్ నిర్మాణ సారధ్యంలో 'ఉయ్యాలా జంపాలా' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన విరించి వర్మ దర్శకత్వంలో గోళ్ళ గీత నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ 'మజ్ను'. నాని హీరోగా నటించిన సూపర్‌హిట్ చిత్రం 'భలే భలే మగాడివోయ్' తర్వాత అదే సూపర్‌హిట్ మ్యూజిక్‌ను రిపీట్ చెయ్యడానికి సంగీత దర్శకుడు గోపిసుందర్ సారధ్యంలో 'మజ్ను' పాటలు రూపొందాయి.
ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాట, "ఓయ్ మేఘమాల", ను ఈరోజు రెడ్ ఎఫ్ ఎమ్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రం ఆడియో ఆల్బం ను వచ్చే వారం విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు.
కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రాలకు పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్. కెమెరా పనితనం, అత్తారింటికి దారేది, సోగ్గాడే చిన్ని నాయనా, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు చేసిన ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఈ చిత్రానికి స్పెషల్ ఎస్సెట్స్ కాబోతున్నాయి. ఈ చిత్రం ద్వారా ఇమ్మానుయేల్, ప్రియాశ్రీ హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్ మాదిరాజ్, కేవశదీప్, అనుపమ, మనీషా ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com