'మజ్ను' ఆడియో రిలీజ్ డేట్....
Send us your feedback to audioarticles@vaarta.com
భలే భలే మగాడివోయ్, జెంటిల్ మన్ వంటి వరుస సక్సెస్‌లు సాధించిన నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వర్మదర్శకత్వంలో చేస్తున్న `మజ్ను` శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. స్టాప్ డ్రింకింగ్, స్టార్ట్ లవ్ అనే లైన్స్‌తో రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా పోస్టర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేస్తున్నారు కాగా, ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని సెప్టెంబర్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments