'అంటే సుందరానికి'... ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన నాని
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ సినిమాలన్నీ ఒకదాని వెంట ఒకటి రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నుంచి మే వరకు భారీ , మధ్యతరహా, చిన్న సినిమాల విడుదలతో బాక్సాఫీస్ కళకళలాడనుంది. ధైర్యం చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ఎప్పుడెలాంటి పరిస్థితులు వస్తాయోనన్న భయంతో రెండు డేట్స్ లాక్ చేసి పెట్టుకుంటున్నారు మేకర్స్.
ఆర్ఆర్ఆర్ విషయంలో తొలుత మార్చి 18, ఏప్రిల్ 28లను అనౌన్స్ చేసిన నిర్మాతలు ఆ తర్వాత మార్చి 25ని ఫిక్స్ చేశారు. అలాగే వపర్‌స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్', వరుణ్ తేజ్ 'గని', రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలకు కూడా రెండేసి రిలీజ్ డేట్స్ ప్రకటించారు నిర్మాతలు. అయితే నేచురల్ స్టార్ నాని మాత్రం వీరిందరికి భిన్నంగా ఒకటి కాదు... రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు.
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. ఇందులో రాజారాణి ఫేమ్ నజ్రియా నజిమ్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే సమ్మర్లో బడా సినిమాలు లైన్లో వుండటంతో ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు.
'మీరంతా రెండు మూడు బ్లాక్ చేస్తే... మేము ఏడు చేయకూడదా?' అని నాని అడిగారు. 'ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్డ్. మెల్లగా డిసైడ్ చేద్దాం' అని స్వయంగా హీరో నాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ఏప్రిల్ 22, 29 .. మే 6, 20, 27 .. జూన్ 3, 10లలో ఏదో ఒక తేదీలో 'అంటే సుందరానికి' ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments