నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా 'కురుక్షేత్రం' ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
యాక్షన్ హీరో అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు అర్జున్. అందుకే యాక్షన్ కింగ్ అని అభిమానులు ఇష్టంగా పిలుచుకుంటారు. యాక్షన్ హీరోగానే కాదు విభిన్నమైన పాత్రలతో మోస్ట్ స్టైలిష్ యాక్టర్ గా సౌత్ లో తన ఇమేజ్ కు కొత్త గ్లామర్ తెచ్చుకున్నాడు అర్జున్. రీసెంట్ గా "నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా", "అభిమన్యుడు" సినిమాలతో ఈ జనరేషన్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. హీరోగా కెరియర్ మొదలు పెట్టిన అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యే 150 మూవీ మైలు రాయిని చేరుకున్నాడు . కురుక్షేత్రం అర్జున్ 150వ మూవీ గా తెలుగులో త్వరలో విడుదలకు కాబోతుంది.
అర్జున్ అనగానే గుర్తుకు వచ్చే యాక్షన్ కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి మరోసారి ప్రేక్షకులకు మెస్మరైజ్ చేయబోతున్నాడు. . తమిళంలో "నిబునన్" గా విడుదలై మంచి సక్సెస్ సాధించిన ఈ మూవీ తెలుగులో "కురుక్షేత్రం" గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
బిగ్ బాస్ సీజన్ 2 లో తనదైన స్టైల్లో దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నాని ఈ మూవీ ట్రైలర్ ని తన ట్విటర్ ద్వారా విడుదల చేసారు. హాలీవుడ్ థ్రిలర్ ని తలపిస్తున్న కురుక్షేత్రం తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ గా మారబోతుందని అన్నారు. అర్జున్ ఇప్పటి వరకూ పోలీస్ పాత్రలు చాలా చేసినా ఒక భిన్నమైన పోలీస్అధికారిగా ఇందులో కనిపించబోతున్నారు. మళయాళంలో మోహన్ లాల్ వంటి స్టార్స్ ని డైరెక్ట్ చేసిన అరుణ్ వైద్యనాథన్ కురుక్షేత్రం ను అద్యంత ఆసక్తిగా మలిచారు.
ఊహించని మలుపులు, ఆసక్తికరమైన కథనాలతో ప్రేక్షకుల ఆలోచనలకు అందని థ్రిల్లర్ గా కురుక్షేత్రం అలరించబోతుంది. అర్జున్ కెరియర్ లో భిన్నమైన చిత్రం గా మారిన "కురుక్షేత్రం" మోస్ట్ మెమరబుల్ మూవీ కాబోతుంది. త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీ లో యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు ప్రసన్న, వరలక్ష్మి శరత్ కుమార్, సుమన్, సుహాసిని, వైభవ్, శ్రుతి హారి హారన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments