'కృష్ణార్జున యుద్ధం' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
పురాణాల్లో కృష్ణుడు, అర్జునుడు కలిసి మహాభారత యుద్ధంలో శత్రువులను జయించారు. ఇప్పుడు మరోసారి కృష్ణ, అర్జున్ కలిసి ఓ మంచి పని కోసం వేసే అడుగే మా 'కృష్ణార్జున యుద్ధం' అని అంటున్నారు నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది. అద్భుతమైన నటనతో నేచురల్ స్టార్‌గా రాణిస్తూ ఎనిమిది వరుస విజయాలను సొంతం చేసుకున్న నాని.. ట్రిపుల్ హ్యాట్రిక్ కోసం ప్రేక్షకుల ముందుకు కృష్ణార్జున యద్ధం సినిమాతో వస్తున్నారు.
వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్న్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' చిత్రాల దర్శకుడు మేర్లపాక దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా.... నిర్మాతలు మాట్లాడుతూ - "కృష్ణార్జున యుద్ధం అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నేచరల్ స్టార్ నాని ఈ చిత్రంలో కృష్ణ, అర్జున్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, సాంగ్స్ అన్నింటికీ ప్రేక్షకులకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా రీసెంట్గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ట్రెండ్ క్రియేట్ చేసింది. సినిమాపై ఉన్న అంచనాలు దీంతో రెట్టింపయ్యాయి. నాని నటనలో మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమే 'కృష్ణార్జున యుద్ధం'. ఆయనకు ఇది ట్రిపుల్ హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుందనడంలో సందేహం లేదు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం" అన్నారు.
నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్: సాహి సురేష్, నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది, దర్శకత్వం : మేర్లపాక గాంధీ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com