నాని, కిషోర్ తిరుమల చిత్రం అప్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
భావోద్వేగభరితమైన సన్నివేశాలని ఎంతో సహజంగా చిత్రీకరించడంలోనూ.. అంతే చక్కగా మాటలు రాయడంలోనూ దిట్ట దర్శకుడు కిషోర్ తిరుమల. తన మొదటి చిత్రం నేను శైలజ`తో అది నిరూపితమైంది. రెండో సినిమా ఉన్నది ఒకటే జిందగీ` ఆశించిన విజయం సాధించకపోయినా.. ఈ డైరెక్టర్ ప్రతిభని ఎవరూ సందేహంచలేదు. అందుకే ఈ నేచురల్ డైరెక్టర్‌కి నేచురల్ స్టార్ నాని ఒక అవకాశం ఇచ్చేసారు. ప్రస్తుతం నాని కృష్ణార్జున యుద్ధం` సినిమాతో బిజీగా ఉన్నారు.
ఈ చిత్రం పూర్తైన వెంటనే నాగార్జునతో కలిసి మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నారు నాని. దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 24 నుంచి చిత్రీకరణ జరుపుకోనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీ ఒక షెడ్యూల్ పూర్తి కాగానే...కిషోర్ తిరుమలతో సినిమాని మొదలు పెట్టనున్నారు నాని. ఫిబ్రవరి తర్వాత మొదలు కానున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అలా ఈ రెండు సినిమాలను సమాంతరంగా చేయడానికి డేట్లను కూడా నాని అడ్జస్ట్ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే...మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం అర్జున్ రెడ్డి` ఫేం విజయ్ దేవరకొండతో ఒక సినిమా.. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో మరో మూవీని నిర్మించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ సంస్థ నిర్మిస్తున్న సవ్యసాచి` చిత్రీకరణ దశలో ఉండగా...రామ్ చరణ్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న రంగస్థలం` సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com