క్రిస్మస్ రేసులో నాని...
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్‌స్టార్ నాని హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్‌రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూపొందనున్న చిత్రం నేను లోకల్. క్యారెక్టర్ బేస్డ్ లవ్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ చిత్రంలోకీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా చూపిస్త మావ సక్సెస్ తర్వాత త్రినాథరావు దర్శకత్వం చేస్తున్న సినిమా ఇది. సెప్టెంబర్ 15 నుండి సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటుంది. సాధారణంగా త్రినాథరావు సినిమాలను చాలా త్వరగా తెరకెక్కిస్తాడు. ఈ సినిమాను డిసెంబర్లో మొదటివారంలో పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ రేసులో నిలపాలని అనుకుంటున్నాడట. క్రిస్మస్కు స్కూల్స్ సెలవులు కావడంతో సినిమా ఆదరణ పొందుతుంది కాబట్టి దిల్‌రాజు కూడా అదే దిశగా ఆలోచనలు చేస్తున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments