నాని 'జెర్సీ' వాయిదా పడుతుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని సినిమాల మీద ప్రేక్షకులే కాదు, హీరోలు కూడా అమాంతం ఆశలు పెంచేసుకుంటుంటారు. నాని నటిస్తున్న 'జెర్సీ' సినిమా అలాంటిదే. ఇందులో క్రికెటర్గా కనిపించబోతున్నారు నాని. దానికోసం ఆయన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు.ఈ సినిమా తన కెరీర్లో నెక్స్ట్ రేంజ్ సినిమా అని భావిస్తున్నారు. క్రికెటర్ రామన్ లంబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని గౌతమ్ తిన్ననూరి రాసుకున్న కథ అనే టాక్ ఉంది.
ఇందులో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ నాయికగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా కీలక పాత్రధారులు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని, సాను వర్గీస్ కెమెరాను నిర్వహిస్తున్నారు. ముందు ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
తర్వాత ఆ డేట్ ఏప్రిల్ 19కి మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏప్రిల్ 19కి కూడా సినిమా విడుదల కావడం కష్టమేనని అంటున్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ చేయాల్సిన పనులు ఇంకా బ్యాలన్స్ ఉన్నాయట. సో ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. అనిరుద్ మేజర్ రోల్ చేసి మ్యూజిక్ అందిస్తున్న తుంబా ఏప్రిల్లోనే విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments