'జెర్సీ'.. పిరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. కాకపోతే అది గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. కొంతమందిలో తమ ప్రతిభ ఏమిటో వెంటనే తెలిస్తే.. మరి కొంతమందిలో ఆలస్యంగా వెలుగు చూస్తుంది. అలా ఓ యువకుడు తనలో దాగి ఉన్న ప్రతిభను ఆలస్యంగా తెలుసుకుని.. లక్ష్యం దిశగా వెళ్ళేందుకు ఏ స్థాయిలో శ్రమించాడు అనే పాయింట్‌తో తెరకెక్కనున్న చిత్రం ‘జెర్సీ’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించనున్న ఈ సినిమాకి ‘మళ్ళీ రావా’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. పిరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాని ఒక క్రికెటర్‌గా కనిపించనున్నారు.
1986 – 1996ల మధ్య కాలంలో ఓ యువకుడు తనలో క్రికెట్ ఆడే ప్రతిభ ఉందని ఆలస్యంగా తెలుసుకుని.. దానికోసం అతను చేసిన కఠోర దీక్ష ఏ విధంగా ఇండియన్ క్రికెట్లో స్థానం సంపాదించి పెట్టిందో తెలియజెప్పే వృత్తాంతమే ఈ చిత్ర కథ అనీ.. ఇది ఎవరినీ ఉద్దేశించింది కాదని దర్శకుడు తెలిపారు. అలాగే.. ఈ సినిమాకోసం నాని ప్రత్యేకంగా క్రికెట్ శిక్షణ కూడా తీసుకుంటున్నారని చెప్పారు. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com