'జెర్సీ'.. పిరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా

  • IndiaGlitz, [Wednesday,June 20 2018]

ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఏదో ఒక ప్ర‌తిభ ఉంటుంది. కాకపోతే అది గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. కొంతమందిలో త‌మ‌ ప్రతిభ ఏమిటో వెంటనే తెలిస్తే.. మరి కొంతమందిలో ఆలస్యంగా వెలుగు చూస్తుంది. అలా ఓ యువకుడు తనలో దాగి ఉన్న ప్రతిభను ఆలస్యంగా తెలుసుకుని.. లక్ష్యం దిశగా వెళ్ళేందుకు ఏ స్థాయిలో శ్ర‌మించాడు అనే పాయింట్‌తో తెర‌కెక్క‌నున్న చిత్రం ‘జెర్సీ’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించ‌నున్న‌ ఈ సినిమాకి ‘మళ్ళీ రావా’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. పిరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాని ఒక క్రికెటర్‌గా కనిపించనున్నారు.

1986 – 1996ల మధ్య కాలంలో ఓ యువకుడు తనలో క్రికెట్ ఆడే ప్రతిభ ఉందని ఆలస్యంగా తెలుసుకుని.. దానికోసం అతను చేసిన కఠోర దీక్ష ఏ విధంగా ఇండియన్ క్రికెట్‌లో స్థానం సంపాదించి పెట్టిందో తెలియజెప్పే వృత్తాంతమే ఈ చిత్ర కథ అనీ.. ఇది ఎవరినీ ఉద్దేశించింది కాదని దర్శకుడు తెలిపారు. అలాగే.. ఈ సినిమాకోసం నాని ప్రత్యేకంగా క్రికెట్ శిక్షణ కూడా తీసుకుంటున్నారని చెప్పారు. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

More News

అప్పుడు మైనస్ ఇప్పుడు ప్లస్

అభిరుచి గల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీదేవి మూవీస్ సంస్థ‌ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్. 'చిన్నోడు పెద్దోడు', 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు',

సుమంత్ సినిమా సిద్ధ‌మ‌వుతోంది

గ‌తేడాది విడుద‌లైన ఫీల్‌గుడ్ మూవీ 'మ‌ళ్ళీ రావా'తో చెప్పుకోద‌గ్గ విజ‌యాన్ని అందుకున్నారు సుమంత్‌. ప్ర‌స్తుతం ఆయ‌న రెండు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు.

విశాల్‌ 'అభిమన్యుడు'ని అభినందించిన సూపర్‌స్టార్‌ మహేష్‌

మాస్‌ హీరో విశాల్‌, హ్యాట్రిక్‌ హీరోయిన్‌ సమంత యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ ప్రధాన పాత్రల్లో విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్స్‌ పై ఎమ్‌.

జులై 6 వస్తొన్న'దివ్యమణి' 

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై గిరిధర్ గోపాల్ దర్శకత్వంలొ నిర్మిస్తున్న చిత్రం 'దివ్య మణి'.

డా.వై ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్‌ "యాత్ర" షూటింగ్ ప్రారంభం

ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి గా రాష్ట్ర‌రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి బ‌యోపిక్ లొ మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.