టీడీపీని కుదిపేస్తున్న నాని వ్యవహారం.. అసలేం జరుగుతోంది!
Send us your feedback to audioarticles@vaarta.com
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం తెలుగుదేశం పార్టీని కుదిపేస్తోంది. రోజురోజుకు నాని ఎందుకిలా వ్యవహరిస్తున్నారో..? అసలు నాని మనసులో ఏముందో..? పార్టీ అధినేతకు సైతం అంతుపట్టని పరిస్థితి. కేశినేని అసలు తెలుగుదేశం పార్టీలో ఉంటారా..? బయటికెళ్లడానికే ఈ తతంగం అంతా నడిపిస్తున్నారా..? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే.. టీడీపీ అధినేత ఇచ్చిన లోక్‌సభ విప్ పదవి వద్దని, అందుకు తాను అర్హుడిని కాదని.. తనకు ఏ పదవి వద్దని పార్టీలోనే ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే. బుధవారం రోజున గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ జరిపిన మంతనాలు సక్సెస్ కాకపోవడంతో నేరుగా చంద్రబాబే రంగంలోకి దిగినప్పటికీ నాని మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. దీంతో పార్టీలో అసలేం జరుగుతోంది..? పార్టీలో ఎంత మంది ఉంటారు..? ఎంత మంది జంప్ అవుతారో..? అనేది చర్చనీయాంశమైంది.
అసలేం జరుగుతోంది..!
ఫేస్‌బుక్ వేదికగా నాని చేస్తున్న పోస్ట్‌లు రెండ్రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఆయన ఫేస్‌బుక్‌లో ‘పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప..’ అని శ్రీశ్రీ అన్న మాటలు పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ వెనుక అర్థం.. పరమార్థం ఆ పెరుమాళ్లకే ఎరుక. మొదట నితిన్ గడ్కరిని నాని కలవడం.. ఆ తర్వాత చంద్రబాబుకు తనకు కీలకపదవి ఇచ్చినప్పటికీ వద్దనడం.. మరోవైపు ఆయన టీడీపీకి టాటా చెబుతారని పుకార్లు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు గెలిచింది ముగ్గురే ముగ్గురు మాత్రమే. ఉన్నది ముగ్గురే అయినప్పటికీ వారిలో కూడా ఒకరిలో ఒకరికి సఖ్యత లేకపోవడంతో పార్టీలో అసలేం జరుగుతోంది..? అని చంద్రబాబు సైతం ఒకింత టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో నాని తన రాజకీయ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Adhiran Ravi
Contact at support@indiaglitz.com