పిరికివాడు తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేదే కృష్ణ గాడి వీర ప్రేమ గాథ - హీరో నాని
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్...చిత్రాలతో వరుస విజయాలు సాధించిన యంగ్ హీరో నాని నటించిన తాజా చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. ఈ చిత్రాన్ని అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి తెరకెక్కించారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ రూపొందిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రాన్ని ఈ నెల 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ హీరో నానితో ఇంటర్ వ్యూ మీకోసం...
ఈ సినిమాకి చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ..చివరకి కృష్ణ గాడి వీర ప్రేమ గాథ టైటిల్ ఫిక్స్ చేసారు కారణం ఏమిటి..?
ఈ సినిమాకి అన్నింటి కంటే టైటిల్ పెట్టడం అనేది కష్టమైంది. ఈ సినిమాకి ఏ టైటిల్ పెడితే బాగుంటుందా అని ఆలోచించాం. అలా ఆలోచిస్తున్నప్పుడు అసలు ఈ సినిమా కథ ఏమిటని ఆలోచిస్తే...ఇందులో నా క్యారెక్టర్ పేరు కృష్ణ. వాడి ప్రేమ కథ. అందుచేత కృష్ణ గాడి వీర ప్రేమ గాథ అని పెడితే బాగుంటుంది అనిపించింది. ఈ టైటిల్ చెప్పగానే యూనిట్ అందరికీ బాగా నచ్చింది. అలాగే గతంలో జగదేకవీరుడు అతిలోక సుందరి, సీతారామయ్య గారి మనవరాలు...ఇలా లెంగ్తీ టైటిల్స్ వచ్చి చాలా రోజులు అయ్యింది. అంతే కాకుండా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ లో జానపదం ఫీల్ ఉంది అనిపించింది అంతే.. ఈ టైటిల్ ఫిక్స్ చేసేసాం.
ఇంతకీ...కృష్ణ గాడి వీర ప్రేమ గాథ కథ ఏమిటి..?
కృష్ణ కు మహాలక్ష్మీ అంటే ప్రాణం. 15 ఏళ్ల నుంచి ప్రేమిస్తుంటాడు. కానీ...ఆ విషయాన్ని తన బెస్ట్ ఫ్రెండ్ కి కూడా చెప్పలేనంత పిరికివాడు. పిరికితనం అనేది అందరిలో ఉంటుంది. అసలు దేని మీద ఆశ లేని వాడికి భయం ఉండదు. భయం ఎంత విలువైంది. అది ఎంత వరకు కృష్ణ కు హెల్ప్ అయ్యింది. చివరికి పిరికివాడైన కృష్ణ తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది ఈ కథ.
ఇందులో బాలయ్య అభిమానిగా నటించారు కదా..ఇంతకీ రియల్ లైఫ్ లో ఎవరి అభిమాని..?
ఈ సినిమాలో బాలయ్య అభిమానిగా నటించాను. కథలో భాగంగానే బాలయ్య అభిమానిగా నటించాను. ఆయన పేరు వాడుకుని ఓ సమస్య లోంచి బయటపడతాను. ఎలా బయటపడ్డాను అనేది సినిమాలో చూస్తే బాగుంటుంది. ఇక రియల్ లైఫ్ లో అయితే నేను కమల్ హాసన్, ఎస్వీఆర్ అభిమానిని.
బాలయ్య అభిమానిగా నటించారు కదా...ఈ విషయాన్ని బాలకృష్ణ గార్కి చెప్పారా..?
నేను చెప్పలేదు కానీ...ఈ విషయం తెలుసుకుని బాలకృష్ణ గారు చాలా ఎగ్జైట్ అయ్యారట. ఓసారి కలసినప్పుడు నా అభిమానిగా నటిస్తున్నావ్ అట కదా అని అడిగారు. హిందూపూర్ లో షూటింగ్ జరిగినప్పుడు చెప్పు షూటింగ్ కి వస్తానన్నారు. ఈ సినిమా రిలీజ్ రోజు చూస్తారు. అందరికీ నచ్చే సినిమా ఇది.
ఈ సినిమాలో బాలయ్య ఫ్యాన్ కదా...మరి తొడకొట్టారా..?
చిన్న సీన్ లో తొడ కొట్టాను. ఆ సీన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది. కానీ చాలా ఫన్నీగా ఉంటుంది.
ఈ సినిమాలో బాలకృష్ణ గారు గెస్ట్ రోల్ లో కనిపిస్తారా..?
బాలకృష్ణ గారితో గెస్ట్ రోల్ చేయిస్తే బాగుంటుందా అని ఆలోచించాం. అయితే అలా చేస్తే...కావాలని చేసినట్టు ఉంటుంది అనిపించి వద్దనుకున్నాం.
డైరెక్టర్ హను రాఘవపూడి అందాల రాక్షసి ఆశించిన విజయాన్నిసాధించలేదు. మరి...మీరు హనుతో సినిమా చేయడానికి కారణం ఏమిటి..?
అసలు అందాల రాక్షసి సినిమా కథ ముందు నాకే చెప్పాడు హను. అది నాకు సెట్ కాదనన్నాను. తను రాసుకున్న ప్రతి కథ ముందు నాకే చెప్పేవాడు. ఒకరోజు నాతో సినిమా చేయాలని..చెప్పి ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని అడిగాడు. అలా...మా డిస్కషన్స్ లో వచ్చిన ఐడియా కాస్త రోజురోజుకు పెరుగుతూ ఈ సినిమా కథగా మారింది. ఫైనల్ గా కథ నచ్చింది ఓకె చెప్పాను.
అందాల రాక్షసి సినిమా చేయకపోవడానికి కారణం నచ్చలేదా..?
అందాల రాక్షసి సినిమా కొంత మందికి నచ్చింది. కొంత మందికి నచ్చలేదు. సినిమా చూడలేదు కానీ కథ చెప్పినప్పుడు నాకైతే నచ్చలేదు.
డైరెక్టర్ హను వర్కింగ్ స్టైల్ గురించి ఏం చెబుతారు..?
అందాల రాక్షసి సినిమా అనేది హను ఏదో కొత్తగా తీద్దామనుకుని చేసిన ప్రయత్నం. ఈ సినిమా ప్రతి ఫేమ్ లో హను కనిపిస్తాడు. హను స్టైల్ ఏమిటనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రతి క్షణం సినిమా గురించి ఆలోచిస్తుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అలాంటి టెక్నీషియన్ ని చూడలేదు.
ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్..చిత్రాలతో వరుస విజయాలు సాధించారు కదా... ఈ సినిమా రిజల్ట్ విషయం లో టెన్షన్ పడుతున్నారా..? లేక కాన్పిడెంట్ గా ఉన్నారా..?
ఈ సినిమా సక్సెస్ అవుతుందా..? లేదా..? అనే టెన్షన్ లేదు. ఎందుకంటే ఈ సినిమా విషయంలో మా టీమ్ అంతా చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. మా నిర్మాతలు అయితే ఏదో సాధించాం అనే ఫీలింగ్ తో ఉన్నారు. అయితే ఇంతకు ముందు పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. వరుసగా రెండు హిట్స్ ఇచ్చాం కదా...ఈసారి ఎలాంటి సినిమా చేసినా చూసేస్తారు అనే గ్యారెంటీ లేదు. ఆడియోన్స్ చాలా క్లియర్ గా ఉన్నారు. కథలో కొత్తదనం లేకపోతే వెంటనే రిజెక్ట్ చేస్తున్నారు. అందుచేత ప్రతి ఏక్టర్ చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి. రెండు హిట్స్ ఇచ్చినా...మూడు హిట్స్ ఇచ్చినా సరే ప్రతి సినిమాకి ఫ్రూవ్ చేసుకోవాలి.
భలే భలే మగాడివోయ్ సినిమా ఓవర్ సీస్ లో రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధించింది. ఈ రేంజ్ సక్సెస్ మీరు ఊహించారా..?
భలే భలే మగాడివోయ్ హిట్ అవుతుంది అనుకున్నాం. కానీ...ఈ రేంజ్ సక్సెస్ సాధిస్తుందని అసలు ఊహించలేదు. ఓవర్ సీస్ లో కలెక్షన్స్ చూసి మేమే షాక్ అయ్యాం. భలే భలే మగాడివోయ్ సినిమా మంచి కథతో సినిమా చేయాలి అని ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ ఇచ్చిందని నా అభిప్రాయం. ఓవర్ సీస్ లో భలే భలే మగాడివోయ్ సినిమా ఆరవ స్ధానంలో నిలిచింది. ఈ సినిమా తర్వాత నాకు రెస్పాన్స్ మరింత పెరిగింది.
భలే భలే మగాడివోయ్ బాగా సక్సెస్ అయ్యింది కదా..మరి రెమ్యూనరేష్ పెంచారా..?
అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పుడు ఫస్ట్ మూవీకి 2,500 రెమ్యూనరేషన్. ఆతర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా రెండో సినిమాకి 3,500 తీసుకున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే రెమ్యూనరేషన్ పెంచాను. మరి...భలే భలే మగాడివోయ్ తర్వాత పెంచనా...(నవ్వుతూ..)
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లుతో ఈ సినిమా ఉంటుంది. అలాగే ఉయ్యాల జంపాలా ఫేం విరంచి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout