అలా ఆలోచించిన వాళ్ల కు మార్కెట్ స్పాన్ పెరగలేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం - నాని
- IndiaGlitz, [Thursday,June 16 2016]
భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ..చిత్రాల వరుస విజయాల తర్వాత నాని నటించిన చిత్రం జెంటిల్ మన్. ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాని సరసన సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. ఆదిత్య 369, వంశానికొక్కడు చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అష్టా చమ్మా కాంబినేషన్లో రూపొందిన జెంటిల్ మన్ చిత్రం ఈనెల 17న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా జెంటిల్ మన్ నానితో ఇంటర్ వ్యూ మీకోసం...
పాత జెంటిల్ మన్ కి కొత్త జెంటిల్ మన్ కి ఏమైనా సంబంధం ఉందా..?
టైటిలే సంబంధం. టైటిల్ తప్పా..ఇంక ఏ సంబంధం లేదు. ఈమధ్య నేను చేసిన చిత్రాలన్నింటిలో లాస్ట్ మినిట్ లో టైటిల్ ఫిక్స్ చేసిన సినిమా ఇదే. ఏ టైటిల్ పెడితే బాగుంటుందా అని చాలా సార్లు డిష్కస్ చేసుకోవడం జరిగింది. ఈ కంటెంట్ కి ఏ టైటిల్ పెడదాం అన్నా ఎవరో ఒకరికి నచ్చడం లేదు. అయితే ఒక రోజు జెంటిల్ మన్ లాంటి టైటిల్ పర్ ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనుకున్నాం. రకరకాల టైటిల్స్ అనుకున్నా ఏదీ సంతృప్తికరంగా లేదు. ఒక రోజు అవసరాల శ్రీనివాస్ తో మాట్లాడుతుంటుంటే... జెంటిల్ మన్ లాంటి టైటిల్ అయితే బాగుంటుంది అనుకున్నాం. జెంటిల్ మన్ లాంటి ఏమిటి జెంటిల్ మన్ అనే పెడితే బాగుంటుంది అనిపించింది. అందరూ ఓకే అనడంతో జెంటిల్ మన్ టైటిల్ గా ఫిక్స్ చేసాం.
ఇంద్రగంటి, అవసరాల, మీరు కలిసి అష్టా చమ్మా చేసారు. మళ్లీ మీ ముగ్గురు కలిసి ఈ సినిమా చేస్తున్నప్పుడు ఫస్ట్ డే షూటింగ్ ఎలా అనిపించింది..?
స్కూలు ఫ్రెండ్స్ ని మళ్లీ కలిసినట్టు అనిపించింది. ఎందుకంటే కెమెరామన్ పి.జి.విందా, శ్రీనివాస్ అవసరాల, నేను ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం. అలాగే నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ మోహన కృష్ణగారు కూడా. సో.. అందరం మళ్లీ కలిసి సినిమా చేయడంతో ఫస్ట్ ఫిల్మ్ కి ఎలా ఎక్సైట్ మెంట్ గా ఫీలయ్యానో ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా అలాగే ఫీలయ్యాను. ఈ ఎనిమిదేళ్లల్లో బోల్డంత మారిపోయి ఉంటారేమో అని అనుకుంటూ షూట్ కి వచ్చాం. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏమిటంటే...ఎవరూ ఏమీ మారలేదు. కొంచెం ఏజ్ పెరిగింది అంతే తప్పితే..మాలో ఎలాంటి మార్పు రాలేదు. అష్టా చమ్మా తర్వాత షూటింగ్ చేస్తూ అంతగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా జెంటిల్ మన్.
అష్టా చమ్మా మీకు ఫస్ట్ ఫిలిమ్..ఇప్పుడు మీరు స్టార్..సెట్ లోకి వెళ్లినప్పుడు ఆ డిఫరెన్స్ మీకు కనిపించిందా..?
డెబ్యూ, స్టార్ అని కాదు కానీ..మార్పు అయితే డెఫినెట్ గా ఉంది. అష్టా చమ్మా చేసేటప్పుడు నేను ఏక్టర్ కాదు..అసలు నేను పనికొస్తానా రానా..నన్ను అసలు ఎవరైనా చూస్తారా..ఇలా బోలుడన్ని డౌట్స్. సర్లే..నాతో ఏదో సినిమా తీస్తున్నారని చేసేసాను. ఈరోజు ఇదే నా ప్రొఫిషన్ అయిపోయింది. నాకు తెలియని ఒక గ్రిప్ వచ్చింది. అలాగే ఈరోజు ఇది తప్పితే వేరే ప్రపంచం లేదు. సో..డెఫినెట్ గా మార్పు బోల్డంత ఉంది. అలాగే మోహన్ గారిలో కూడా మార్పు ఉంది. పర్సనల్ లైఫ్ లో అలాగే ఉన్నా..కెరీర్ పరంగా, టెక్నికల్ పరంగా చాలా మార్పు వచ్చింది. అష్టా చమ్మా టైమ్ లో మోహన్ గారు డైరెక్టర్ గా కన్నా చాలా మంచి రైటర్. ఈరోజు అంతే మంచి రైటరు. అంతకు మించి డైరెక్టర్ ఆయన. టెక్నికల్ నాలెడ్జె ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. అందరం ఎనిమిదేళ్లల్లో చాలా విషయాలు నేర్చుకుని మళ్లీ కలిసి పనిచేస్తుంటే అదోక తెలియని ఫీలింగ్.
ఇంతకీ..జెంటిల్ మన్ కథ ఏమిటి..?
జెంటిల్ మన్ ఒక థ్రిల్లర్ మూవీ. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీ థ్రిల్ ని నేను మిస్ చేసినట్టు అవుతుంది. అయితే కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..ఇందులో ఎంటర్ టైన్మెంట్ ఉంది. మంచి రొమాన్స్ ఉంది. ఈ మధ్యలో ఎమోషన్ కూడా ఉంటుంది. ఇలాంటి జోనర్స్ రావడం కష్టం. పర్ ఫెక్ట్ కాంబినేషన్ కుదిరిన ఒక స్టోరీ. దీనిలో చాలా సెన్సిబుల్ యాంగిల్ ఉంది. మీరు చూస్తున్నదానికి జరుగుతున్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలాంటి క్లాంపెక్స్ స్ర్కిప్ట్ హ్యాండిల్ చేయాలంటే మంచి రైటర్ అవసరం. మెహన్ కృష్ణ గారు స్ర్కీన్ ప్లే పక్కాగా రాయగల రైటర్ కావడంతో ఇలాంటి స్ర్కిప్ట్ కుదిరింది.
భలే భలే మగాడివోయ్ మీ జోనర్ సినిమా ఇప్పుడు జోనర్ మారుస్తున్నారు..ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనే భయం ఉందా..?
సక్సెస్ అవుతుందా లేదా అని ఏరోజు ఆలోచించను. మనకు నచ్చింది అంటే ప్రేక్షకుడికి నచ్చుతుంది అని నమ్మకం. జెంటిల్ మన కథ విన్న వెంటనే నాకు ఏమనిపించింది అంటే...ఇలాంటి సినిమా థియేటర్ లో ఉంది అంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేవాడిని అనిపించింది. ఎప్పడూ నేను వేరు ప్రేక్షకుడు వేరు అనుకోలేదు. నాకు నచ్చింది అంటే సక్సెస్ అవుతుందని ఎక్కడో నమ్మకం. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకం. నేనేదో డిఫరెంట్ ఫిల్మ్ చేస్తున్నాను. కొత్త జోనర్ చేస్తున్నాను అని ఫీలవలేదు. నేను ఫీలయ్యింది ఒక్కటే మంచి స్ర్కిప్ట్ చేస్తున్నాను అని.
మణిశర్మ గారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేసారు కదా..సినిమా చూసినప్పుడు మ్యూజిక్ ఎలా ఉంది అనిపించింది..?
సమరసింహారెడ్డి, ఖుషి, టక్కరి దొంగ..ఇలా నా చిన్నప్పుడు వచ్చిన మణిశర్మ ఆల్బమ్స్ అన్ని సూపర్ హిట్సే. ఆయన నా సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు అనగానే ఏదో తెలియని ఎక్సైట్ మెంట్ వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ జోనర్ ఫిల్మ్. అందుచేత దీనికి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో అని ఆసక్తి ఏర్పడింది. అందరికి తెలిసిందే మణిశర్మ గార్ని మెలోడి బ్రహ్మ అంటారు. అనుకున్నట్టుగానే ఈ సినిమాలో ఉన్న రెండు మెలోడి సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. ఫస్టాఫ్ రీ రికార్డింగ్ అయ్యాకా వెళ్లి చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చేసాడేమో అనిపించింది. ఆయన స్టైల్ పక్కన పెట్టి కొత్తగా చేసారు.
ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు కదా..వాళ్ల పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుందా..? లేక పాటల టైమ్ లో ఇలా వచ్చి అలా వెళ్లిపోతారా..?
నా సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. నా సినిమాల్లో ఎప్పుడూ హీరోయిన్స్ కి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఒక హీరోయిన్ ఉంటేనే ఇంపార్టెంట్ రోల్ రావడం లేదు. అలాంటిది ఇద్దరు హీరోయిన్స్ ఉండి ఇద్దరికీ ఇంపార్టెంట్ రోల్స్ రావడం గొప్ప విషయం. నేను ఈ సినిమాకి ఎంత ఇంపార్టెంటో హీరోయిన్స్ కూడా అంతే ఇంపార్టెంట్.
ఈ ఇద్దరి హీరోయిన్స్ గురించి పర్సనల్ గా చెప్పాలంటే ఏం చెబుతారు..?
సురభి విషయానికి వస్తే...ఐశ్వర్య అనే క్యారెక్టర్ చేసింది. ఈ పాత్ర ఇన్నోషంట్ గా ఉంటుంది. ఓరిజినల్ గా కూడా సురభి ఇన్నోషంట్ గా ఉంటుంది. తనలో ఒక తెలియని మంచితనం ఉంది. హ్యాఫీగా ఉంటే చాలు అనుకుంటుంది. ఇదే క్వాలిటీ ఐశ్వర్యలో కూడా ఉండడం వలన క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అయ్యింది. ఇక నివేదా థామస్ విషయానికి వస్తే...దృశ్యం తమిళ వెర్షెన్ లో కమల్ హాసన్ గారి కూతురుగా నటించింది. ఏక్టింగ్ లో కూడా కమల్ హాసన్ గారి కూతురు అనేంత బాగా పెర్ ఫామ్ చేసింది. చాలా చాలా ఇంటిలిజెంట్ ఏక్టర్. ఖచ్చితంగా భవిష్యత్ లో చాలా మంచి ఏక్టరస్ అవుతుంది.
తెలుగు తెలియని ఇద్దరు హీరోయిన్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు సెట్ లో వాతావరణం ఎలా ఉండేది..?
విచిత్రం ఏమిటంటే..నివేదా ధామస్ వచ్చిన 10 రోజుల్లోనే తెలుగు నేర్చేసుకుంది. సురభికి తెలుగు తెలియదు. మేం నవ్వుతుంటుంటే ఎందుకు నవ్వుతున్నారు అని అడిగేది. మేం తన మీదే జోక్ వేసాం అని చెప్పినా నవ్వేసేది. హీరో, హీరోయిన్...అని కాకుండా టీమ్ అంతా యంగ్ స్టర్స్..కలిసి ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాం.
భలే భలే మగాడివోయ్ తో ఓవర్ సీస్ లో 1 మిలియన్ క్రాస్ చేసారు కదా..ఒక స్టార్ గా మిమ్మల్ని మీరు ఎలా అప్ డేట్ చేసుకుంటారు..?
చాలా మంది ఇలా అడుగుతున్నారు..1 మిలియన్ క్రాస్ చేసింది కదా..ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని. నా ఉద్దేశ్యం ఏమిటంటే...ఏమీ కానీ నాని అనేవాడు ఈరోజు ఇలా ఉన్నాడంటే..ఒక రోజు తీసుకున్న నిర్ణయం వలనే. సడన్ గా సక్సెస్ వచ్చింది అని చెప్పి కొత్త నిర్ణయం తీసుకోవడం అవసరం లేదు అనిపించింది. ఈరోజు వరకు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. మనసుకి నచ్చిన సినిమాలే చేసాను. ఆ సినిమాలే ఇక్కడ వరకు తీసుకువచ్చాయి. అందుచేత కొత్త రకం నిర్ణయాలు అవసరం లేదు. ఇదే కంటిన్యూ చేస్తాను ఇంకా మీ అందరికి మరింత దగ్గర అవుతాను అనుకుంటున్నాను.
ఒక హీరో మార్కెట్ స్పాన్ పెరిగినప్పుడు వాళ్లు తీసే సినిమా కథలు, బడ్జెట్ మారిపోతున్నాయి..అలా మీ సినిమాకి బడ్జెట్ పెరిగిందా..?
నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే...మార్కెట్ స్పాన్ కోసం ఆలోచించినవాడికి మార్కెట్ స్పాన్ పెరగలేదు. మంచి సినిమాలు చేద్దాం అనుకున్నవాడికి మార్కెట్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది అని నా అభిప్రాయం.
సక్సెస్ ఫెయిల్యూర్ లో మీ పాత్రే ఉంటుందా..? డైరెక్టర్, ప్రొడ్యూసర్ పాత్ర ఉంటుందా..?
సక్సెస్ కంప్లీట్ గా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కి ఇచ్చేస్తాను. ఫెయిల్యూర్ మాత్రం నా పై ఆధారపడి ఉంటుంది.
బాగా నమ్మకంతో చేసి ఫెయిల్ అయిన సినిమా ఏదైనా ఉందా..?
ఎటో వెళ్లిపోయింది మనసు. నేను ఎక్కువుగా సక్సెస్ అవుతుంది అనుకున్నాను. రాజా గారు గొప్ప సాంగ్స్ ఇచ్చారు. కాకపోతే రాజా గారి రీ రికార్డింగ్, గౌతమ్ గారి మేకింగ్ మ్యాచ్ కాలేదు. రాజా గారిది ఒక టైప్ ఆఫ్ క్లాస్, గౌతమ్ గారది ఒక టైప్ ఆఫ్ మేకింగ్. రెండూ మ్యాచ్ కాలేదు. ఇద్దరికి మ్యాచ్ అయ్యుంటే గొప్ప సినిమా అయ్యుండేది.
ప్రస్తుతం కథల కొరత ఉంది. అయితే కొత్త కథలు రాసే యువ రచయితలు చాలా మంది ఉన్నారు. కానీ...వాళ్లు హీరోలను కలిసే అవకాశం ఉండడం లేదు. దీని గురించి మీరు ఏమంటారు..?
నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఉండడం వలన ఎవరైనా కథ చెబితే పది నిమిషాల్లోనే కథలో కంటెంట్ ఉందా లేదా...టెక్నికల్ నాలెడ్జ్ ఉందా లేదా..? అనేది తెలిసిపోతుంది. దాని వలన మంచి కథలు ఎంచుకోవడం ఈజీ అవుతుంది. అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాం. అయితే టాలెంట్ ఉన్నా వాళ్లు ఏదో రకంగా హీరోలను అప్రోచ్ అవుతారు.
ఈ మధ్య షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ డైరెక్టర్స్ అవుతున్నారు. ఇటీవల మిమ్మిల్ని అలా ఇంప్రెస్ చేసిన వాళ్లు ఎవరైనా ఉన్నారా..?
నాకు ఇంకా గుర్తు ఉంది. రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ గురించి అతను ఎవరో తెలియకుండానే..అతను తీసిన షార్ట్ ఫిల్మ్ చూసి మంచి డైరెక్టర్ అవుతాడు అని ట్విట్టర్ లో పోస్ట్ చేసాను. అప్పుడు నాకు సుజిత్ థ్యాంక్యూ అని పెద్ద లెటర్ పెట్టాడు. చాలా సార్లు కలవానుకున్నాం కుదరలేదు. మొన్న కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని గుర్తుచేసాడు.
కొత్తవాళ్లకు ఒక హీరోగా మీరు ఎంత వరకు దగ్గరగా ఉంటారు...?
100% కొత్తవాళ్లకు అందుబాటులోనే ఉంటాను. నాకు తెలిసిన వాళ్లు ఆల్రెడీ కథ విని బాగుంది అని చెబితే వినడం జరుగుతుంది. వచ్చినవన్నీ వినాలి అంటే ఇబ్బందే. అందుచేత స్ట్రాంగ్ గా ఫీడ్ బ్యాక్ చెబితే ఈజీ అయిపోతుంది.
కథలు ఏమైనా రాస్తున్నారా..?
నాకు ఐడియాలు వస్తే వెంటనే ఫోన్ లో రాసుకుంటాను. సరదాగా ఒక హాబీగా అయినా నోట్ చేసుకుంటాను. ఏదైనా ఐడియా వస్తే ఆలోచించడం ఇష్టం. ఆ థింకింగ్ ని ఎంజాయ్ చేస్తుంటాను.
మీ ఆలోచనలను ఇంకెవరైనా ఇంప్లిమెంట్ చేసినట్టు అనిపించిందా..?
క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నాం. ఐడియా ఎవరికి వచ్చింది అనేది కాదు. ఎవరూ ఇంప్లిమెంట్ చేసారు అనేదే ఇంపార్టెంట్.
ఓన్ ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు..?
ఓన్ ప్రొడక్షన్ ఆలోచన ఉంది. అయితే అది ఎలా జరుగుతాదో నాకు తెలియదు. యంగ్ స్టార్స్ అందరితో కలిసి వర్క్ చేయాలి అని ఉంది. దీని గురించి ఆలోచిస్తున్నాను. అయితే ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలంటే ఓ మూడు సంవత్సరాలు పడుతుంది.
తెలుగు మీదే ఎక్కువ కాన్ సన్ ట్రేషన్ చేస్తున్నట్టున్నారు..?
నాకు చాలా ఇష్టమైన టెక్నీషియన్స్ తమిళ్ లో ఉన్నారు. నాకు ఇష్టమైన పది సినిమాలు చెబితే అందులో నాలుగైదు తమిళ సినిమాలు ఉంటాయి. అంతగా ఇష్టమైన తమిళ ఇండస్ట్రీలో నేను భాగం అవ్వాలనుకుంటున్నాను. అయితే కొన్నాళ్లు కంప్లీట్ గా తెలుగు పై ఫోకస్ చేద్దాం అనుకున్నాను. ఇక నుంచి ద్విభాషా( తెలుగు, తమిళ్) చిత్రాలు చేయాలనుకుంటున్నాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
విరంచి వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాను. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇది కంప్లీట్ లవ్ స్టోరి. దీని తర్వాత దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో సినిమా ఒకటి చేస్తున్నాను.
విరంచి వర్మ చేస్తున్న సినిమాలో మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నారని విన్నాం. అంటే మీ లైఫ్ నే సినిమాగా తీస్తున్నారా..?
ఈ సినిమాకి, నా లైఫ్ కి సంబంధం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒకటి రెండు సీన్స్ ఉంటాయి అంతే.
ఫైనల్ గా మీ గత చిత్రాలతో పోలిస్తే జెంటిల్ మన్ ఆడియన్స్ ని ఎలా శాటిస్ ఫై చేస్తుంది..?
చాలా కాలం తర్వాత కొత్తరకమైన ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుంది జెంటిల్ మన్.