నిత్యావసర ధరలు ఆకాశానికి, కానీ టికెట్ రేట్లు మాత్రం.. నాని కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ లో టికెట్ రేట్లు, థియేటర్స్ సమస్యపై ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. నిర్మాతలు సినిమాలని థియేటర్స్ లో విడుదల చేస్తే థియేటర్స్ వ్యవస్థ నిలబడుతుందని లేకుంటే అంతరించిపోతుందనే వాదనలు ఎక్కువవుతున్నాయి. దీనితో టాలీవుడ్ సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా థియేటర్స్ ని ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తున్నారు.
ఇదీ చదవండి: పిక్ టాక్: రాశి ఖన్నా సెక్సీ ఫోజు.. హాట్ అండ్ స్టైలిష్
విప్లవ సినిమాలు చేసే ఆర్ నారాయణమూర్తి నారప్ప సినిమాని ఓటిటిలో విడుదల చేసినందుకు సురేష్ బాబుని ప్రశ్నించారు. ఓటిటి 25 శాతం మంది ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన ప్రజాలు నారప్ప చిత్రాన్ని ఎలా చూడాలి అని నారాయణ మూర్తి సురేష్ బాబుని ప్రశ్నించారు. వెంకటేష్ సినిమాని మిగిలిన వాళ్ళు చూడకూడదా.. వాళ్ళు వినోదం పొందకూడదా అని ప్రశ్నించారు. అందుకే సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని కోరారు.
అదే విధంగా నేచురల్ స్టార్ నాని థియేటర్స్ , టికెట్స్ ధరల విషయంలో తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గళం విప్పాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాని ఉద్వేగభరితమైన ప్రసంగం చేశాడు. సమయం సందర్భమో నాకు తెలియదు. థియేటర్స్ లో సినిమా చూడడం మన జన్మ హక్కు.
మనం ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని తీసుకుని వీకెండ్ లో సినిమాకు వెళతాం. ఆరోగ్యం చాలా ముఖ్యం. కాదనను. కరోనా లాంటి పరిస్థితుల్లో ముందుగా మూసివేసేది థియేటర్స్ నే.. అన్నింటికంటే చివరగా ఓపెన్ చేసేది కూడా థియేటర్స్ నే. రెస్టారెంట్స్, పబ్స్, బార్లు ముందుగా ఓపెన్ చేసేస్తారు.
రెస్టారెంట్స్, బార్స్ లో మాస్కు తీసేయాలి.కానీ థియేటర్స్ లో మాస్కు వేసుకునే సినిమా చూడొచ్చు. వాటికంటే థియేటర్స్ సేఫ్ ప్లేస్. అన్నింటికీ ఒకే తరహా నిబంధనలు ఉండాలి. కరోనా వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతోంది సినిమానే. నేను నిర్మాతల కోసమో, హీరోల కోసమో మాట్లాడడం లేదు. థియేటర్, సినిమాపై ఆధారపడి లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.
నిత్యావసర ధరలు భారీగా పెరుగుతున్నాయి. కూరగాయలు, పెట్రోల్ లాంటివి లేకుంటే సామాన్యుల జీవితం గడవదు. లాంటి వస్తువుల ధరలే పెరుగుతున్నాయి. కానీ సినిమా విషయానికి వచ్చేసరికి అనేక రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అంటూ నాని పరోక్షంగా టికెట్ ధరల గురించి ప్రస్తావించాడు. నాని వ్యాఖ్యలు ఏపీలో టికెట్ ధరలపై కౌంటర్ వేసినట్లుగా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com