విక్రమ్‌కుమార్‌తో నాని?
Send us your feedback to audioarticles@vaarta.com
`13బి, మనం, ఇష్క్, 24, హలో` వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కుమార్ త్వరలోనే నేచరల్ స్టార్ నానితో సినిమా చేయబోతున్నాడని సమాచారం. నిజానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విక్రమ్ కాంబినేషన్‌లో గీతాఆర్ట్స్ ఓ సినిమా చేయాల్సింది. కానీ ఎందుకనో సినిమా ఆగిపోయింది.
దీంతో విక్రమ్ కుమార్ నానిని కలిసి స్క్రిప్ట్ వినించాడట. నాని ఓకే చెప్పాడట. ఈ ఏడాది చివర్లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. బన్ని ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో `జెర్సీ` సినిమా చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments