మూడు షేడ్స్‌లో...

  • IndiaGlitz, [Saturday,August 11 2018]

నేచుర‌ల్ స్టార్ నాని రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అందులో ఒక‌టి నాగార్జున‌తో చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్ కాగా.. మ‌రోటి 'మ‌ళ్ళీరావా' ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'జెర్సీ' సినిమా చేస్తున్నాడు. ఈ జ‌ర్సీ చిత్రంలో నాని మూడు షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

ఈ షేడ్స్‌లో నల‌బై ఏళ్లు వ‌యసున్న వ్య‌క్తిగా కూడా నాని క‌నిపిస్తాడ‌ట‌. ఇంత‌కు ముందు 'ఎటో వెళ్ళిపోయింది మ‌న‌సు' చిత్రంలో నాని మూడు షేడ్స్‌లో న‌టించినా.. న‌ల‌బై ఏళ్ల వ్య‌క్తిగా క‌న‌ప‌డ‌లేదు. అయితే జెర్సీలో మ‌ధ్య వ‌య‌స్కుడిగా క‌న‌ప‌డ‌నుండ‌టం విశేషం.

ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఏదో ఒక ప్ర‌తిభ ఉంటుంది. కాకపోతే అది గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. కొంతమందిలో త‌మ‌ ప్రతిభ ఏమిటో వెంటనే తెలిస్తే.. మరి కొంతమందిలో ఆలస్యంగా వెలుగు చూస్తుంది. అలా ఓ యువకుడు తనలో దాగి ఉన్న ప్రతిభను ఆలస్యంగా తెలుసుకుని.

లక్ష్యం దిశగా వెళ్ళేందుకు ఏ స్థాయిలో శ్ర‌మించాడు అనే పాయింట్‌తో తెర‌కెక్క‌నున్న చిత్రం 'జెర్సీ'. పిరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నాని ఒక క్రికెటర్‌గా కనిపించనున్నారు.