మెగా కాంపౌండ్‌లో నాని..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా కాంపౌండ్‌లో నాని సినిమా చేయబోతున్నారు. `భలే భలే మగాడివోయ్` తర్వాత మరలా ఆయన ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ లో ఆయన ఓ సినిమా చేయబోతున్నారని టాక్. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోతున్నారు. `బ్రహ్మోత్సవం` తర్వాత ఇప్పటిదాకా శ్రీకాంత్ అడ్డాల మరే సినిమా చేయలేదు. అంతకు ముందు కూడా ఆయన `ముకుంద` తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` వంటి మల్టీస్టారర్ తెరకెక్కించిన శ్రీకాంత్ తాజాగా ఈ మంచి విలువలతో ఉన్న సరదా సినిమాను ప్లాన్ చేశారట. `కొత్త బంగారు లోకం` టచ్ ఉంటూనే ఇంకాస్త మెచ్యూర్డ్ గా ఉంటుందని టాక్. ఈ సినిమాను ఇటీవల నానికి చెప్పారట. ఆయన కూడా దాదాపుగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసినట్టేనని సమాచారం.
`జెర్సీ` విశేషాలు
అప్పుడెప్పుడో పదో తరగతిలో క్రికెట్ వదిలేసిన నాని ఇన్నాళ్లకు మళ్లీ బ్యాట్ పట్టుకుని ప్రాపర్‌గా ట్రయినింగ్ తీసుకుంటున్నారు. `జెర్సీ`లో ఆయన సన్నివేశాలు చాలా బావుంటాయట. నిజంగా బ్యాట్స్ మన్ ఆడుతున్నట్టే ఉంటుందట. నానికి సచిన్ అంటే ఇష్టం. ఈ సినిమాను ఒకరకంగా సచిన్‌కు ట్రిబ్యూట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
96 చేస్తారా?
ఇటీవల తమిళంలో హిట్ అయిన సినిమా 96. 1996లో చదువుకున్న ఓ బ్యాచ్ రీ యూనియన్‌కు సంబంధించిన సినిమా ఇది. విజయ్ సేతుపతి, త్రిష నటించారు. ఈ సినిమా హక్కులను దిల్‌రాజు తీసుకున్నారని, ఇందులో నాని పర్ఫెక్ట్ గా సరిపోతారని వినికిడి. ఈ సినిమా గురించి నాని ఇంకా ఏ అధికారిక ప్రకటనా ఇవ్వలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments