మణి.. సినిమాలో నాని..?
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తే చాలు అని చాలా మంది నటీనటులు అనుకుంటారు. అలాగే నాని కూడా అనుకున్నాడు. మణిరత్నం తెరకెక్కించిన ఓకె బంగారం సినిమాలో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తేనే నాని చాలా ఎగ్జైయిట్ అయిపోయాడు. నాలుగు రోజులు పాటు మణిరత్నం సార్..దగ్గరుండి డబ్బింగ్ చెప్పించారని చాలా ఆనందపడ్డాడు.
ఇక అసలు విషయానికి వస్తే..మణిరత్నం.. కార్తీ, దుల్కర్ సల్మాన్ లతో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్ ని తెలుగు హీరో తో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. హీరో నానికి ఈ మూవీలో నటించే అవకాశం వచ్చిందట. అయితే తెలుగు వెర్షన్ కి హీరోగా నటిస్తాడా...? లేక ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడా..? అనేది తెలియాల్సి వుంది. మణిరత్నం సినిమాలో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తేనే ఎగ్జైయిట్ అయిపోయాడు. ఇప్పుడు మణిరత్నం సినిమాలో నటించే అవకాశమే వచ్చింది. మరి.. ఇప్పుడెంత ఎగ్జైయిట్ అవుతాడో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com