అనుష్క చిత్రంలో నాని..

  • IndiaGlitz, [Monday,July 16 2018]

వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తున్న నేచుర‌ల్ స్టార్ నాని బిగ్ బాస్ 2తో బిజీగా ఉన్నారు. అలాగే నాగార్జున‌తో క‌లిసి 'దేవదాస్‌' సినిమాలో న‌టిస్తున్నారు. అయితే రీసెంట్‌గా నాని దిల్‌రాజు బ్యాన‌ర్‌లో శ‌ర్వానంద్‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని.. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి.

అందులో మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమా విష‌యానికి వ‌స్తే.. డైరెక్ట‌ర్ చంద్ర శేఖ‌ర్ ఏలేటి ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ను రాసుకున్నాడ‌ట‌. అందులో ఓ కీల‌క పాత్రలో నాని న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. మ‌రి ఇందులో నాని పాత్ర‌కు ఉన్న ప్రాధాన్యం తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే...