త‌మిళ రీమేక్‌లో నాని?

  • IndiaGlitz, [Saturday,September 29 2018]

విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా న‌టించిన చిత్రం '96'. వింద్ మీన‌న్ సంగీత సార‌థ్యంలో ఇటీవ‌ల విడులైన ట్రైల‌ర్‌లోని బ్యాగ్రౌండ్ స్కోర్‌కి, పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సి.ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా హ‌క్కుల‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ద‌క్కించుకున్నారు.

ఈయ‌న తెలుగులో రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. సినిమాను రీసెంట్‌గా నాని, స‌మంత‌కు చూపించారు. నానికి ఈ సినిమా చాలా బాగా న‌చ్చేసింద‌ట‌. ఎలాగైనా సినిమా చేయాల‌ని.. డేట్స్ అడ్జ‌స్ట్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతా ఓకే అయితే నాని, స‌మంత న‌టించే మూడో చిత్ర‌మిదే. డిసెంబ‌ర్‌లో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి.