విజయ్ దేవరకొండతో నాని హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణగాడి వీర ప్రేమగాధ` వంటి విజయవంతమైన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ భామ మెహ్రీన్. గత ఏడాది మహానుభావుడు`, రాజా ది గ్రేట్` సినిమాలతో వరుసగా విజయాలు అందుకున్న ఈ భామకు.. కేరాఫ్ సూర్య`, జవాన్` చిత్రాల రూపంలో పరాజయాలు కూడా క్యూ కట్టాయి. కాజల్ అగర్వాల్ పోలికలు ఉండడం ఈ అమ్మడికి కొంత ప్లస్ అయినప్పటికీ.. మరీ బొద్దుగా ఉండటం వల్ల అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రావడం లేదన్నది సినీ విశ్లేషకుల మాట.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గోపీచంద్ 25వ చిత్రం 'పంతం'లో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మరో అవకాశం కూడా ఈమెను వెతుక్కుంటూ మరీ వచ్చింది. కాస్త వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళ్, తెలుగు భాషల్లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జంటగా మెహ్రీన్ ఎంపికైందని తెలిసింది. ఈ నెలలోనే చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments