మెగాస్టార్‌తో నాని హీరోయిన్‌

  • IndiaGlitz, [Wednesday,May 29 2019]

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం త‌న 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరు ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే కొర‌టాల అన్నీ సిద్ధం చేసుకుని మెగాస్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటార‌ట‌. అందులో ఒక హీరోయిన్‌గా న‌య‌న‌తార లేదా అనుష్క‌ను తీసుకునే అవ‌కాశాలున్నాయి. కాగా.. మ‌రో హీరోయిన్ కోసం శ్ర‌ద్ధా శ్రీనాథ్‌ను తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. రీసెంట్‌గా 'జెర్సీ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ క‌న్న‌డ భామ‌. మ‌రి రెండో చిత్రానికే మెగాస్టార్‌తో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం మంచి విష‌య‌మే.