మెగాస్టార్‌తో నాని హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి` చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే కొరటాల అన్నీ సిద్ధం చేసుకుని మెగాస్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. అందులో ఒక హీరోయిన్‌గా నయనతార లేదా అనుష్కను తీసుకునే అవకాశాలున్నాయి. కాగా.. మరో హీరోయిన్ కోసం శ్రద్ధా శ్రీనాథ్‌ను తీసుకోవాలని అనుకుంటున్నారట. రీసెంట్‌గా `జెర్సీ` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ భామ. మరి రెండో చిత్రానికే మెగాస్టార్‌తో నటించే అవకాశం దక్కించుకోవడం మంచి విషయమే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments