నానితో పాటు విలనిజం చూపించనున్న హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్‌కు చెందిన అదితిరావు హైదరి బాలీవుడ్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విలక్షణమైన పాత్రలు చేయడానికి ఈ అమ్మడు ఆసక్తిని చూపుతుంది. తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం వంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు నాని జతగా వి సినిమాలో నటించింది. నాని 25వ చిత్రంగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సుధీర్‌బాబు, నివేదా థామస్ కూడా నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా సినిమాను మార్చి 25న విడుదల చేయాలనుకున్నారు.
కానీ కరోనా వైరస్ ప్రభావంతో దేశం లాక్ డౌన్ విధించారు. దీంతో థియేటర్స్ మూతపడ్డాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ సినిమాలో నాని విలన్‌గా, సుధీర్‌బాబు పోలీస్ ఆఫీసర్‌గా కనపడతాడని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. నాని విలనిజాన్ని ఎక్కువగా చూపించే సినిమా ఇదే అవుతుందని టాక్. తాజా సమాచారం మేరకు నాని విలనిజంతో పాటు అదితిరావు హైదరి విలనిజాన్ని కూడా తెరపై చూడొచ్చునని అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com