బాలీవుడ్‌కి వెళ్తున్న నాని నాయిక!
Send us your feedback to audioarticles@vaarta.com
నాని హీరోగా నటిస్తున్న 'జెర్సీ' చిత్రంలో ఆయన సరసన నటిస్తున్న కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్. ఈమె తాజాగా బాలీవుడ్లో 'మిలాన్ టాకీస్'తో అడుగుపెడుతున్నారు. తిగ్మాంశు ధూలియా తెరకెక్కించిన ఈ చిత్రంలో అలీ ఫాజల్ హీరోగా నటిస్తున్నారు.
ఈ సినిమా గురించి శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ "బాలీవుడ్లో నటించాలని నేనేం ఎప్పుడూ అనుకోలేదు. తిగ్మాంశు స్నేహితుడు ఓ రచయిత. ఆయన నా నటనను విక్రమ్ వేదాలో చూసి నా పేరు రెకమండ్ చేశారట. నాకు స్క్రిప్ట్ పంపించారు. ఆడిషన్ చేశాను.
కెమెరా ముందు క్లోజ్‌గా చేయమన్నారు. అది కూడా చేశాను. చాలా క్విక్‌గా ఆడిషన్ పూర్తయింది. ఇక హిందీతో ఏమైనా ప్రాబ్లమా? అని అడిగారు. నాకు హిందీతో ఏం ప్రాబ్లమ్ లేదు. నాకు హిందీ బాగా వచ్చు. ఎందుకంటే మా నాన్నగారు డిఫెన్స్ లో పనిచేశారు. సో నాకు నార్త్ ఇండియా, అక్కడి కల్చర్ అసలు కొత్త కాదు" అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout