రకుల్ ప్లేస్ లో నాని హీరోయిన్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ బాబు, మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీలో, రామ్ చరణ్ ధృవ చిత్రంలో, సాయిధరమ్ తేజ్ మిస్టర్ చిత్రంలో నటిస్తూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇక కోలీవుడ్ లో కూడా రాణించాలి అనుకుంటున్న రకుల్ కి విశాల్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. విశాల్ హీరోగా మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ అనే చిత్రం రూపొందుతుంది.
ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. రకుల్ ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే...మహేష్, చరణ్ ధృవ, సాయిధరమ్ తేజ్ మిస్టర్ చిత్రాల్లో రకుల్ బిజీగా ఉండడం వలన విశాల్ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందట. ఇప్పుడు రకుల్ ప్లేస్ లో నాని తో మజ్ను సినిమాలో నటించిన అను ఇమ్మాన్యువేల్ ను సెలెక్ట్ చేసారు. ఈ విషయాన్ని అను ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. విశాల్ - మిష్కిన్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ లో పాల్గొంటానా అని ఎదురుచూస్తున్నట్టు తెలియచేసింది..! అది సంగతి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com