బాల‌య్య చిత్రంలో నాని హీరోయిన్‌

  • IndiaGlitz, [Monday,February 04 2019]

ప్ర‌స్తుతం నాని న‌టిస్తోన్న చిత్రం 'జెర్సీ'. ఈ చిత్రంలో నాని జ‌త‌గా క‌న్నడ భామ శ్ర‌ద్ధా శ్రీనాథ్ న‌టిస్తుంది. క‌న్న‌డంలో 'యుట‌ర్న్‌'లో న‌టించిన శ్ర‌ద్ధా శ్రీనాథ్ త‌ర్వాత కొన్ని త‌మిళ చిత్రాల్లోనూ న‌టించింది. 'జెర్సీ' ఆమె తొలి చిత్రం.

ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే.. మ‌రో అవకాశం ద‌క్కించుకుంది శ్రద్ధా శ్రీనాథ్‌. నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లో ప్రారంభం కాబోయే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా హీరో్యిన్‌గా శ్ర‌ద్ధాశ్రీనాథ్‌ను తీసుకోవాల‌ని యూనిట్ భావిస్తోంది. ఆ దిశ‌గా శ్ర‌ద్ధాతో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయని స‌మాచారం.