నాని హీరోయిన్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్‌తో పాటు.. రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి నాగార్జునతో చేస్తున్న మల్టీస్టారర్ `దేవదాస్` కాగా.. మరోటి `మళ్ళీరావా` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో `జెర్సీ` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ సహా కొంత మంది పేర్లు వినిపించినా.. చివరికి దర్శక నిర్మాతలు కొత్త హీరోయిన్ వైపుకే మొగ్గు చూపారట. మలయాళీ మద్దుగుమ్మ రెబ్బా మోనిక జాన్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది. ఈమె తెలుగు, తమిళంలో నటిస్తున్న ఓ హీరోయిన్‌కి కజిన్ అవుతుందని సమాచారం.
ఈ జెర్సీ చిత్రంలో నాని మూడు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ షేడ్స్‌లో నలబై ఏళ్లు వయసున్న వ్యక్తిగా కూడా నాని కనిపిస్తాడట. ఇంతకు ముందు `ఎటో వెళ్ళిపోయింది మనసు` చిత్రంలో నాని మూడు షేడ్స్‌లో నటించినా.. నలబై ఏళ్ల వ్యక్తిగా కనపడలేదు. అయితే జెర్సీలో మధ్య వయస్కుడిగా కనపడనుండటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments