నాని హీరోయిన్ డ‌బుల్ ధ‌మాకా

  • IndiaGlitz, [Tuesday,May 08 2018]

‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో కథానాయికగా పరిచయమైన మళయాళ కుట్టి మాళవికా నాయర్. ఆ సినిమాలో తన న‌ట‌న‌తో మరో నిత్య మీనన్ అనిపించుకుంది. ఆ తర్వాత ‘కళ్యాణ వైభోగమే’ సినిమాలోనూ కథానాయికగా మెప్పించింది. అనంతరం కొంత కాలం విరామం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పది రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రాలే ‘టాక్సీవాలా’, ‘మహానటి’. ‘మహానటి’ విషయానికొస్తే.. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. ఇందులో జెమినీ గణేషన్ మొదటి భార్య అలమేలు (బాబ్జి)పాత్రలో మాళవిక న‌టించింది. న‌ట‌న‌కి అవ‌కాశ‌మున్న పాత్ర ఇది.

సావిత్రి పాత్ర‌తో కూడా ఆమెకు కొన్ని స‌న్నివేశాలు ఉంటాయి. అయితే.. నిడివి ప‌రంగా ఎక్కువ సీన్స్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇక.. ‘టాక్సీవాలా’ సినిమా తీసుకుంటే.. ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న సినిమా ఇది. అయితే.. వీరిద్దరి మధ్య సన్నివేశాలు తక్కువే ఉంటాయని మాళవిక చెప్పుకోస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా పది రోజుల గ్యాప్‌లో వస్తున్నాయి. మే 9న ‘మహానటి’ విడుద‌ల కానుండ‌గా.. మే 18న ‘టాక్సీవాలా’ రిలీజ్ అవుతోంది. వీటితో పాటు చిరంజీవి చిన్న‌ల్లుడు కల్యాణ్ దేవ్‌ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది మాళవిక.

More News

కేతరీన్ సరికొత్త డ్యాన్స్

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, స్టైల్ సాధించుకొన్న నటీమణి కేతరీన్ థెరీసా.

రెగ్యులర్ షూటింగ్‌లో సుమంత్ 25వ చిత్రం సుబ్రహ్మణ్యపురం

ఇటీవల మళ్ళీ రావా వంటి ఓ వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం

మ‌హిళా ద‌ర్శ‌కుల‌తోనే..

ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా కె.వి.ఆనంద్ రూపొందించిన  తమిళ అనువాద చిత్రం 'అనేకుడు'(2015)తో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ముద్దుగుమ్మ అమైరా ద‌స్తూర్‌.

సుకుమార్‌కు ప్ర‌త్యేక‌మైన రోజు ఇది

'రంగస్థలం'తో సంచలన విజయం అందుకున్న ద‌ర్శ‌కుడు సుకుమార్. 1980ల నాటి గ్రామీణ వాతావరణాన్ని పునః సృష్టించి వెండితెరపై మ్యాజిక్ చేశారు.

విభిన్నమైన చిత్రాలని నిర్మించగల ప్రతిభ ని తయారు చేయడమే లక్ష్యం - నాగార్జున

'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8  చిత్రాల ప్రదర్శన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ ఫిలిం అండ్ మీడియా (AISFM)