నాని హీరోయిన్ డబుల్ ధమాకా
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో కథానాయికగా పరిచయమైన మళయాళ కుట్టి మాళవికా నాయర్. ఆ సినిమాలో తన నటనతో మరో నిత్య మీనన్ అనిపించుకుంది. ఆ తర్వాత ‘కళ్యాణ వైభోగమే’ సినిమాలోనూ కథానాయికగా మెప్పించింది. అనంతరం కొంత కాలం విరామం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పది రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రాలే ‘టాక్సీవాలా’, ‘మహానటి’. ‘మహానటి’ విషయానికొస్తే.. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఇది. ఇందులో జెమినీ గణేషన్ మొదటి భార్య అలమేలు (బాబ్జి)పాత్రలో మాళవిక నటించింది. నటనకి అవకాశమున్న పాత్ర ఇది.
సావిత్రి పాత్రతో కూడా ఆమెకు కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అయితే.. నిడివి పరంగా ఎక్కువ సీన్స్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇక.. ‘టాక్సీవాలా’ సినిమా తీసుకుంటే.. ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న సినిమా ఇది. అయితే.. వీరిద్దరి మధ్య సన్నివేశాలు తక్కువే ఉంటాయని మాళవిక చెప్పుకోస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా పది రోజుల గ్యాప్‌లో వస్తున్నాయి. మే 9న ‘మహానటి’ విడుదల కానుండగా.. మే 18న ‘టాక్సీవాలా’ రిలీజ్ అవుతోంది. వీటితో పాటు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది మాళవిక.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com