మరో యంగ్ డైరెక్టర్‌కి నాని గ్రీన్ సిగ్నల్..?
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా ఫుల్ స్పీడుమీదున్నాడు. రీసెంట్‌గా నిర్మాత హిట్‌తో హిట్ అందుకున్నాడు నాని. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం మేరకు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో సినిమా చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే ఇదే ఏడాదిలో రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేస్తాడని టాక్.
మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా సినిమాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఇప్పుడు మరో సినిమాకు సిద్ధమయ్యాడు. రీసెంట్‌గా నానిని కలిసి లైన్ చెప్పాడట. నానికి కూడా లైన్ నచ్చడంతో ఆయన ఓకే చెప్పాడని టాక్. నాని ఈ నెల 25న తన 25వ చిత్రం వితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈసినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్‌లో నాని నటించాడు. ఈ చిత్రాన్ని మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి కూడా నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com